ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆఫీసులకు వెళ్లి వచ్చే ఇబ్బందులు లేకుండా, ఇంటి దగ్గరే కూర్చుని ప్రశాంతంగా పని చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసమే ఎక్కువగా వెతుకుతున్నారు. ముఖ్యంగా మెట్రో సిటీస్‌కు వెళ్లి రూమ్ రెంట్లు, ప్రయాణ ఖర్చులు భరించలేని వాళ్ళు రిమోట్ జాబ్స్ కోసమే ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే ఈరోజు మనము ఈ ఆర్టికల్ లో ప్రముఖ సంస్థ నుంచి విడుదల అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ‘బ్లింకిట్’ వాయిస్ ప్రాసెస్ కోసం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పని చేయవచ్చు.
| సంస్థ | బ్లింకిట్ |
| ఖాళీలు | 150 |
| జీతం | రూ. 2.5 లాక్ |
| అర్హత | ఇంటర్, డిగ్రీ |
| సెలెక్షన్ ప్రాసెస్ | ఇంటర్వ్యూ |
| అప్లై విధానం | ఆన్లైన్ |
| ఇంటర్వ్యూ విధానం | ఆన్లైన్ |
| అఫిసియల్ వెబ్సైట్ | blinkit. com |
ఈ రిక్రూట్మెంట్ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో మొత్తం 150 దాకా ఖాళీలు ఉన్నాయి. సాధారణంగా నాలుగైదు పోస్టులు ఉన్నప్పుడు కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది, కానీ వందకు పైగా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ నుండి ఐదేళ్ల లోపు అనుభవం ఉన్నవాళ్ల వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు.
అసలు ఇందులో చేయాల్సిన పని ఏంటి?
బ్లింకిట్ కస్టమర్ కేర్ రోల్‌లో జాయిన్ అయిన వాళ్లు కస్టమర్లతో కాకుండా, మెయిన్‌గా ‘డెలివరీ పార్ట్‌నర్స్ తో డీల్ చేయాల్సి ఉంటుంది. నిత్యావసరాలు, ఆర్డర్ కస్టమర్ల ఇళ్లకు చేరవేసే డెలివరీ రైడర్లకు లొకేషన్ దొరకకపోవడం, యాప్‌లో టెక్నికల్ సమస్యలు రావడం, పేమెంట్స్ దగ్గర ఇబ్బందులు లేదా ఆర్డర్ పికప్ చేసుకునేటప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్లు సపోర్ట్ టీమ్‌కు కాల్ చేస్తారు. అలా వచ్చే క్వెరీస్‌ను మీరు ఫోన్ ద్వారా విని, వాళ్లకు ఓపికగా సమాధానాలు ఇస్తూ సమస్యలను సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
అర్హతలు మరియు కావలసిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్
చాలా ఐటీ ఉద్యోగాల లాగా దీనికి పెద్ద పెద్ద టెక్నికల్ డిగ్రీలు ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్లు లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తప్పనిసరి కాదు కాబట్టి చదువు ఆపేసిన వాళ్లకు కూడా ఇదొక మంచి అవకాశం. అయితే, ఇంటి నుండి పని చేయాలి కాబట్టి మీ దగ్గర కొన్ని సొంత వనరులు ఉండటం తప్పనిసరి అవి ఏంటో కింద తెలుసుకుందాం.

- ల్యాప్‌టాప్/కంప్యూటర్: మీ దగ్గర సొంతంగా కనీసం 8GB RAM మరియు విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్‌టాప్ ఖచ్చితంగా ఉండాలి.
- ఇంటర్నెట్: ఇంట్లో హై-స్పీడ్ వైఫై కనెక్షన్ ఉండటం మేండేటరీ. పవర్ కట్స్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా నెట్ నడిచేలా బ్యాకప్ ఉండాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్: ఎదుటివాళ్లు చెప్పేది ఓపికగా వినడం, సమస్యను త్వరగా అర్థం చేసుకుని స్పష్టంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి.
వర్క్ టైమింగ్స్ మరియు జీతం వివరాలు
ఇక పని వేళలు ఎలా ఉంటాయో చూస్తే… మీరు వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారంలో ఒక రోజు రొటేషనల్ వీకాఫ్ ఇస్తారు, అంటే సెలవు ఖచ్చితంగా ఆదివారమే రావాలని లేదు, షిఫ్టులను బట్టి మారుతుంది. రోజుకు 9 గంటల షిఫ్ట్ ఉంటుంది. ఇందులో 8 గంటలు యాక్టివ్ ప్రొడక్షన్ కాగా, మిగిలిన 1 గంట సమయాన్ని భోజనం, టీ బ్రేక్స్ ఉంటాయి.
శాలరీ
శాలరీ విషయానికి వస్తే, స్టార్టింగ్ లో నెలకు ₹14,400 CTC ఉంటుంది. కానీ అభ్యర్థి ప్రతిభ, ఎక్స్పీరియన్స్ ఆధారంగా యాన్యువల్ ప్యాకేజీ ₹1.5 లక్షల నుండి ₹1.75 లక్షల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుభవాన్ని బట్టి అది ₹2.2 లక్షల నుండి ₹2.5 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే కంపెనీలో జాయిన్ అయిన కొత్తలో పని ఎలా చేయాలో అర్థం కావడానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు శాలరీ అందుతుంది.
ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి?
ఇంటి నుంచే పని కాబట్టి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా పూర్తిగా ఆన్‌లైన్ లోనే జరుగుతుంది. అయితే ఇందులో సెలెక్ట్ అవ్వడానికి మొత్తం 5 రౌండ్ల క్లియర్ చేయాల్సి ఉంటుంది.
- HR Evaluation
- Operations Evaluation L1
- Operations Evaluation L2
- Versant Test
- Client Evaluation
గమనిక
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం గానీ, లేదా కంపెనీలో జాయిన్ అవ్వడం కోసం గానీ ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వంద శాతం ఉచిత జాయినింగ్. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు అడిగితే నమ్మవద్దు.
ఆసక్తి ఉన్నవాళ్లు తమకు అర్హత ఉందో లేదో చూసుకుని, కింద ఇచ్చిన అప్లై లింకు లేదా ప్రముఖ జాబ్ పోర్టల్స్ ద్వారా ఈ బ్లింకిట్ డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ రౌండ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నా, స్కిల్స్ మరియు అర్హత ఉన్న వాళ్ళకు ఇది ఒక మంచి ఆవకాశం, అస్సలు మిస్ చేసుకోకండి.
FAQ
ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌నా?
అవును. ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా ఇంటి నుంచే పని చేయవచ్చు.
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
150 కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
కనీస విద్యార్హత ఏమిటి?
ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. డిగ్రీ తప్పనిసరి కాదు.
సిస్టమ్ sస్పెసిఫికేషన్స్ ఏంటి?
కనీసం 8GB RAM, Windows 10 ఉన్న ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ మరియు హై-స్పీడ్ Wi-Fi కనెక్షన్ ఉండాలి.
జీతం ఎంత ఇస్తారు?
స్టార్టింగ్ ₹14,400 ఉంటుంది. అనుభవాన్ని బట్టి ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లో జరుగుతుందా?
మొత్తం సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది.
ఉద్యోగం కోసం ఏమైనా ఫీజు చెల్లించాలా?
లేదు










