బ్యాంకింగ్ రంగంలో జాబ్ కొట్టాలి అనుకొనే గ్రాడ్యుయేట్లకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అనే చెప్పుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా లలో ఖాళీగా ఉన్న మొత్తం 12,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది. అయితే, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది. వచ్చే వారం, అంటే జూన్ 8వ తేదీనే ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి గడువు కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.
| సంస్థ | SBI & BOB |
| ఖాళీలు | 12,150 |
| వయసు అర్హత | 20 ఏళ్లు నుండి 28 ఏళ్లు |
| ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ | డిగ్రీ |
| దరకస్తూ చివరి తేదీ | జూన్ 8 2026 |
| స్టైపెండ్ | రూ.15,000/- |
| సెలెక్షన్ ప్రాసెస్ | కంప్యూటరు టెస్ట్ |
| అఫిసియల్ వెబ్సైట్ | sbi.bank.in & bankofbaroda.bank.in |
ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
ఈ రిక్రూట్‌మెంట్‌లో రెండు పెద్ద బ్యాంకులు కలిసి భారీగా పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఎస్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా లలో విడివిడిగా ఉన్న ఖాళీల వివరాలు”

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7,150 పోస్టులు
ఎస్బీఐ దేశవ్యాప్తంగా మొత్తం 7,150 అప్రెంటిస్ ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి సంఖ్యలోనే పోస్టులు కేటాయించారు.
- ఆంధ్రప్రదేశ్: 709 ఖాళీలు
- తెలంగాణ: 491 ఖాళీలు
- బ్యాంక్ ఆఫ్ బరోడా : 5,000 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మొత్తం 5,000 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. సొంత రాష్ట్రంలోనే పని చేయాలనుకునే వాళ్లకు ఇందులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: 188 ఖాళీలు
- తెలంగాణ: 83 ఖాళీలు
రెండు బ్యాంకులు కలిపి ఆంధ్రప్రదేశ్‌లో 897 పోస్టులు, తెలంగాణలో 574 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. లోకల్ కాంపిటీషన్ ని బట్టి అభ్యర్థులు తమ ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు.
అర్హతలు
- విద్యార్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
- వయస్సు: అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
బ్యాంకింగ్ రంగంలో రెగ్యులర్ ఉద్యోగాల తరహాలోనే దీనికి కూడా పక్కా సిస్టమాటిక్ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం మూడు స్టేజీల ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు:

- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: మొదటగా ఆన్‌లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి.
- లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ : అభ్యర్థులు ఏ రాష్ట్రం నుండి అయితే అప్లై చేస్తున్నారో, అక్కడ మాట్లాడే స్థానిక భాషపై పట్టు ఉండాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడటం వస్తే ఈ టెస్ట్ క్లియర్ చేయడం చాలా ఈజీ. (టెన్త్ లేదా ఇంటర్ లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివిన వాళ్లకు సాధారణంగా ఈ టెస్ట్ నుండి మినహాయింపు ఉంటుంది).
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: పై రెండు స్టేజీల్లో క్వాలిఫై అయిన వాళ్లను ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరీఫికేషన్ కు పిలుస్తారు.
స్టైపెండ్
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకింగ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు ₹15,000 స్టైపెండ్ రూపంలో అందుతుంది.
ఇది పర్మనెంట్ బ్యాంక్ ఉద్యోగం కాదు, కేవలం ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ మాత్రమే. అయితే, దేశంలోనే టాప్ బ్యాంకుల్లో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ రావడం వల్ల, భవిష్యత్తులో వచ్చే రెగ్యులర్ బ్యాంక్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో లేదా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్స్ సాధించడానికి ఈ అనుభవం చాలా ఉపోయాపడుతుంది.
ఎలా అప్లై చేయాలి
ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 8 వరకు వెయిట్ చేయకుండా ఆలోపే ప్రాసెస్ ఇప్పుడే పూర్తి చేయండి.
డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ వైపు వెళ్లాలనుకునే వాళ్లకు ప్రాక్టికల్ గా బ్యాంక్ పనితీరు ఎలా ఉంటుందో నేర్చుకోవడానికి ఇదొక భారీ ఆవకాశం. ఈ ఛాన్స్ ని మిస్ అవ్వకుండా అందరు తప్పకుండా అప్లై చేసుకోండి.
SBI: CLICK HERE
BOB: CLICK HERE
FAQ
ఇది పర్మనెంట్ ఉద్యోగమా?
కాదు. ఇది ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ మాత్రమే.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ తప్పనిసరిగా రాయాలా?
టెన్త్ లేదా ఇంటర్‌లో సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులకు ఇవ్వాల్సిన అవసరం లేదు
అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?
జూన్ 8 చివరి తేదీ.
SBI మరియు BOB రెండింటికీ అప్లై చేయవచ్చా?
నోటిఫికేషన్ నిబంధనలను అనుసరించి అర్హత ఉంటే రెండు బ్యాంకుల పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్‌లో 897, తెలంగాణలో 574 పోస్టులు ఉన్నాయి.
నెలకు ఎంత స్టైపెండ్ ఇస్తారు?
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000 స్టైపెండ్ వస్తుంది.
మొత్తం ఎన్ని అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి?
SBIలో 7,150, Bank of Barodaలో 5,000 పోస్టులు కలిపి మొత్తం 12,150 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?
అవును. ఎలాంటి బ్యాంకింగ్ అనుభవం లేకపోయినా అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.









