ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం కాస్త తగ్గాయి. ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్లాలనుకునే ఫ్రెషర్స్‌కు ఎంట్రీ లెవల్‌లో కెరీర్ స్టార్ట్ చేయడానికి బీపీఓ లేదా కస్టమర్ సపోర్ట్ రంగాలు ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. మరీ ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజం అయిన ‘ఫ్లిప్‌కార్ట్’ పేరు మీద వచ్చే ఉద్యోగాలకు కుర్రాళ్లలో ఎప్పుడూ క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక మంచి అప్‌డేట్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ లో పని చేయడానికి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ప్రముఖ రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ అయిన ‘క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్’ ఈ హైరింగ్ బాధ్యతలను చూసుకుంటోంది.
| సంస్థ | ఫ్లిప్‌కార్ట్ |
| జాబ్ రోల్ | కస్టమర్ సపోర్ట్ |
| వయసు అర్హత | 18 ఏళ్లు |
| క్వాలిఫికేషన్ | డిగ్రీ/ఇంటర్ |
| జీతం | రూ.30,000 |
| లొకేషన్ | హైదరాబాద్, చెన్నై, బెంగళూరు |
| ఖాళీలు | 100 |
| అఫిసియల్ వెబ్సైట్ | flipkartcareers. com |
ఈ రిక్రూట్మెంట్ లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇందులో మొత్తం 100 దాకా ఖాళీలు ఉన్నాయి. సాధారణంగా ఐదు లేదా పది పోస్టులు ఉన్నప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ, వంద ఓపెనింగ్స్ ఉన్నప్పుడు అభ్యర్థులు కాస్త కష్టపడితే ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీస్ లొకేషన్లలో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. కాబట్టి లోకల్‌గా ఉంటూ జాబ్స్ కోసం వెతికే సౌత్ ఇండియన్ అభ్యర్థులకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ నుండి ఐదేళ్ల లోపు అనుభవం ఉన్నవాళ్ల వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు.

జాబ్ రోల్ ఏంటి?
ఈ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోల్ లో జాయిన్ అయిన వాళ్లు ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా షాపింగ్ చేసే కస్టమర్ల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎవరికైనా ఆర్డర్ డెలివరీ ఆలస్యం అయినా, రీఫండ్ డబ్బులు రాకపోయినా, లేదా ప్రొడక్ట్ నచ్చక రిటర్న్ పెట్టాలన్నా వాళ్లు కస్టమర్ కేర్‌కే కాల్స్ లేదా చాట్ చేస్తారు. అలా వచ్చే సందేహాలను ఓపికగా విని, కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్లకు సొల్యూషన్ చూపించాలి. ఇందులో మెయిన్‌గా కస్టమర్లను హ్యాండిల్ చేయడం, ఇన్-బౌండ్, అవుట్-బౌండ్ ప్రాసెస్ లు ఉంటాయి. దీనికోసం కంప్యూటర్ స్క్రీన్లను వేగంగా నావిగేట్ చేయడం, డేటాను చెక్ చేయడం లాంటి బేసిక్ విషయాలు తెలిసి ఉండాలి.
విద్యార్హతలు
చాలామందికి ప్రైవేట్ ఉద్యోగాలనగానే ఖచ్చితంగా పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలేమో అనే అనుమానం ఉంటుంది. కానీ ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రాసెస్ కు డిగ్రీ ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్లు కూడా నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. ఇంటర్నేషనల్ లేదా US ప్రాసెస్ లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉండాలి. కస్టమర్ అడిగే ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుని, ఫ్లూయెంట్‌గా సమాధానం చెప్పగలిగే నైపుణ్యం ఉండటం చాలా ముఖ్యం. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ లాంటి భాషలు వస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం ఇంకా ఈజీ అవుతుంది.
శాలరీ మరియు షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి?
ఇక నిరుద్యోగులు మెయిన్‌గా చూసేది జీతం గురించే. ఈ పోస్టులకు మీ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్ మరియు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ని బట్టి నెలకు రూ. 30,000 వరకు జీతం లభిస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 2.25 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది. బేసిక్ శాలరీతో పాటు మీరు చేసే పనితీరును బట్టి అదనంగా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. పండగల సీజన్ లో లేదా సేల్స్ ఉన్నప్పుడు ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
కానీ ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది 24*7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే జాబ్. అంటే కంపెనీ అవసరాలను బట్టి మార్నింగ్, ఆఫ్టర్ నూన్ లేదా నైట్ షిఫ్ట్స్ లో ఎప్పుడైనా డ్యూటీ పడొచ్చు. ముఖ్యంగా అబ్బాయిలతో పాటు నైట్ షిఫ్ట్స్ చేయడానికి ఇబ్బంది లేని అమ్మాయిలు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వారంలో రొటేషనల్ సెలవులు ఉంటాయి.
ఇంటర్వ్యూ ప్రాసెస్ మరియు ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాల కోసం మీరు కంపెనీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రస్తుతానికి పూర్తిగా వర్చువల్ (ఆన్‌లైన్) లోనే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. మీ ఇంట్లోనే కూర్చుని లాప్‌టాప్ లేదా మొబైల్ ద్వారా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వొచ్చు. కమ్యూనికేషన్ రౌండ్, బేసిక్ కంప్యూటర్ టెస్ట్ లాంటివి క్లియర్ చేస్తే సరిపోతుంది. సెలెక్ట్ అయిన వాళ్లు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు కింద ఇచ్చిన అప్లై లింకు ను ఓపెన్ చేసి అందులో పోస్ట్ చేసిన ఫ్లిప్‌కార్ట్ జాబ్ ఓపెనింగ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ రెజ్యూమే లో కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ లాంటి కీ-వర్డ్స్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే హెచ్ఆర్ టీమ్ ముందుగా మీ ప్రొఫైల్ చెక్ చేసి, షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు మాత్రమే కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా ఇంటర్వ్యూ లింక్స్ పంపిస్తుంది.
చాలామంది అభ్యర్థులు గూగుల్‌లో కన్సల్టెన్సీ ఫోన్ నంబర్లు వెతికి డైరెక్ట్‌గా హెచ్ఆర్‌లకు కాల్స్ చేస్తుంటారు. అలా ఎవరూ చేయకండి, కేవలం అఫిసియల్ పోర్టల్ ద్వారా మాత్రమే అధికారికంగా అప్లై చేసుకోండి. కాబట్టి ఎలాంటి నంబర్ల కోసం వెతకకుండా డైరెక్ట్‌గా ఆన్‌లైన్ లోనే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం బెటర్.
FAQ
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయొచ్చు?
ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు 0 నుండి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు కూడా అర్హులు.
ఈ ఉద్యోగాలు ఏ లొకేషన్లలో ఉన్నాయి?
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై
జీతం ఎంత ఉంటుంది?
ప్రొఫైల్ మరియు అనుభవాన్ని బట్టి నెలకు సుమారు ₹30,000 వరకు శాలరీతో పాటు అదనపు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి
ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది?
ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్ లోనే నిర్వహిస్తారు.
డిగ్రీ తప్పనిసరిగా ఉండాలా?
లేదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు.
ఈ జాబ్‌లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయా?
అవును. ఇది 24*7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే జాబ్ కాబట్టి నైట్ షిఫ్ట్స్‌లో కూడా పని చేయాల్సి రావచ్చు.
ఎలా అప్లై చేయాలి?
పైన ఇచ్చిన అప్లై లింకు ను ఓపెన్ చేసి మీ డీటైల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి
ఫ్రెషర్స్‌కు సెలక్షన్ ఛాన్స్ ఉంటుందా?
కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ బాగుంటే ఫ్రెషర్స్‌కు కూడా సెలెక్ట్ అవచ్చు










