#APInterExams #AP10thExams #TSInterExams #TS10thExams #CompetitiveExams #GovtJobs #PrivateJobs #WFH

---Advertisement---

రైల్వేలో బంపర్ నోటిఫికేషన్: 6,565 పోస్టుల భర్తీ కి షెడ్యూల్ విడుదల.. అప్లై చేయడానికి ఈ సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి

మనలో చాలా మంది రైల్వే ఉద్యోగాలు కొసం ప్రిపేర్ ఆవుతూ నోటిఫికేషన్ కొసం ఎదురు చూపులు చూస్తుంటారు, ఎప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని అలాంటి వాళ్ళు ఇక చూడాల్సిన అవసరం లేదు ఎందుకు రైల్వే శాఖ నుండి వెళ్లలో ఖాళీలు భర్తీ కొరకు సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇక నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ పండగ కన్నా తక్కువేం కాదు.

---Advertisement---

HIGHLIGHTS

  •  18 ఏళ్లు నుండి 33 ఏళ్లు మధ్య ఉన్న వాళ్ళు అర్హులు
  • జూన్ 30 నుండి దరకస్తులు షురూ
  • రూ. 30,000 వేలు దాకా జీతం

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఒక భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి మే 18న అఫీషియల్ షార్ట్ నోటీస్ విడుదల చేసింది. మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

రైల్వేలో ఉద్యోగం చేయాలి అనుకొనే అభ్యర్థులకు ఇది చాలా పెద్ద అవకాశం. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, ఏయే జోన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కింద చదివితెలుసుకోండి.

ఖాళీలు..

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ (Grade I Signal): 323 పోస్టులు
  • టెక్నీషియన్ గ్రేడ్-III (Grade III): 6,242 పోస్టులు

మన సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 368 ఖాళీలు ఉన్నాయి. అలాగే ముంబై లో అత్యధికంగా 870, చెన్నై లో 785 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

కావాల్సిన అర్హతలు

  • టెక్నీషియన్ గ్రేడ్-III: టెన్త్ క్లాస్ (Matriculation/SSLC) పాస్ అవ్వడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) లేదా యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వాళ్లు దీనికి అర్హులు. వయస్సు 18 నుండి 30 ఏళ్ల లోపు ఉండాలి.
  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: దీనికి డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు (పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇస్తారు). వయస్సు 18 నుండి 33 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి).

జీతం ఎంత ఉంటుంది?

రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలకు మంచి శాలరీ ప్యాకేజీ ఉంటుంది/ 7వ పే కమిషన్ ప్రకారం బేసిక్ పేతో పాటు డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), గ్రేడ్-I సిగ్నల్ (లెవెల్ 5) ప్రారంభ బేసిక్ పే ₹29,200 వేలు మరి గ్రేడ్-III (లెవెల్ 2) ప్రారంభ బేసిక్ పే ₹19,900 వేలు వస్తుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 30, 2026
  • అప్లై చేయడానికి చివరి తేదీ: జూలై 29, 2026

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రైల్వే ఉద్యోగాల్లో మెడికల్ స్టాండర్డ్స్ చాలా ముఖ్యం కాబట్టి, నోటిఫికేషన్ వచ్చాక ఆ వివరాలు ఒకసారి చూసుకోవడం మంచిది.

అప్లై చేయడం ఎలా?

జూన్ 30న ఆన్‌లైన్ పోర్టల్ ఓపెన్ కాగానే అభ్యర్థులు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా మీ బేసిక్ డీటెయిల్స్, ఆధర్ కార్డ్ కార్డు వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా అప్లికేషన్లు స్టార్ట్ అవ్వడానికి ఒక నెల రోజులకు పైగా టైమ్ ఉంది కాబట్టి, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఇప్పుడే మీ సర్టిఫికెట్లను రెడీ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.