న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) పరిధిలోని కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ (KKNPP) నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీ-II స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నారు. మొత్తం 255 ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటామిక్ ఎనర్జీ విభాగంలో స్థిరపడాలనుకునే వాళ్లకు ఇదొక గొప్ప మిస్ అవ్వకూడాని ఛాన్స్.
| సంస్థ | NPCIL |
| పోస్టు | ట్రైనీ & టెక్నీషియన్ |
| ఖాళీలు | 255 |
| అర్హత | 10వ తరగతి, ఇంటర్ |
| జీతం | రూ.21,700 |
| దరకస్తూ ప్రారంభం తేదీ | జూన్ 8 2026 |
| దరకస్తూ చివరి తేదీ | జూన్ 29 2026 |
| అఫిసియల్ వెబ్సైట్ | npcil.nic.in |
ఏయే పోస్టులు ఉన్నాయి? అర్హతలు ఏంటి?
ఇందులో ప్రధానంగా రెండు రకాల పోస్టులు ఉన్నాయి.

- ప్లాంట్ ఆపరేటర్: ఇంటర్మీడియట్ (10+2) సైన్స్ స్ట్రీమ్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) చదివి, కనీసం 50% మార్కులతో పాస్ అయిన వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు.
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (మరియు ఇతర ట్రేడ్స్): టెన్త్ క్లాస్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో విడివిడిగా కనీసం 50% మార్కులు ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్లో రెండేళ్ల ఐటీఐ (ITI) సర్టిఫికేట్ ఉండాలి.
వయస్సు విషయానికొస్తే.. 18 నుండి 24 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది?
దీనికి ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. పరీక్ష రెండు స్టేజీల్లో జరుగుతుంది.
దీనికి ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. పరీక్ష రెండు స్టేజీల్లో జరుగుతుంది.
- స్టేజ్-1 (ప్రిలిమినరీ టెస్ట్): ఇది కేవలం 1 గంట పరీక్ష. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి (మొత్తం 150 మార్కులు).
- స్టేజ్-2 (అడ్వాన్స్డ్ టెస్ట్): ఇది 2 గంటల పాటు జరుగుతుంది. ఇందులో కూడా 50 ప్రశ్నలు ఉంటాయి (మొత్తం 150 మార్కులు).
ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఎంపికైన వాళ్లకు బేసిక్ పే ₹21,700తో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్ కూడా ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 8, 2026
- అప్లై చేయడానికి చివరి తేదీ: జూన్ 29, 2026
- ఎగ్జామ్ డేట్: త్వరలోనే అనౌన్స్ చేస్తారు.
అప్లై చేయడం ఎలా?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 8న లింక్ ఓపెన్ అవ్వగానే npcilcareers.co.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఆ కాపీని కేవలం మీ దగ్గర రెఫరెన్స్ కోసం ప్రింట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది, ఎలాంటి డాక్యుమెంట్లు ఎన్పీసీఐఎల్ ఆఫీస్కు పోస్ట్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అప్డేట్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ చూడకుండా మా లాంటి ట్రస్ట్ఎడ్ వెబ్సైట్ లేదా అఫిసియల్ వెబ్సైట్ లోనే చూడండి.









