ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన టెక్ మహీంద్రా Work from Home పద్ధతిలో పని చేయడానికి కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ విడుదల చేసింది. లాక్‌డౌన్ తర్వాత చాలా కంపెనీలు ఆఫీసులకు పిలుస్తున్నా, ఇంటి నుండే పని చేసే ఇలాంటి అవకాశాలు అప్పుడు అప్పుడు మాత్రమే వస్తాయి కాబట్టి మిస్ చేసుకోవడం తెలివి తక్కువ పనే అని చెప్పచ్చు.
| సంస్థ | టెక్ మహీంద్రా |
| పోస్టు | కస్టమర్ వాయిస్ ప్రాసెస్ |
| లొకేషన్ | రిమోట్ |
| అర్హత | 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ |
| సెలెక్షన్ ప్రాసెస్ | ఇంటర్వ్యూ |
| అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
| అఫిసియల్ వెబ్సైట్ | techmahindra.com |
అర్హత
ఈ జాబ్‌కు అప్లై చేయడానికి డిగ్రీ తప్పనిసరి ఏమీ కాదు, చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌లలో చక్కగా మాట్లాడగలిగే వాళ్లకు ఇది చాలా మంచి ఛాన్స్.

కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్…
ఇంటి నుండి పని చేయాలి కాబట్టి మీ దగ్గర సొంతంగా లాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉండాలి. వాటికి ఈ క్రింది ఫీచర్లు కంపల్సరీగా ఉండాలి.
- i5 ప్రాసెసర్ లేదా AMD రైజెన్ 5 (కనీసం 7th జనరేషన్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి).
- మినిమం 10GB ర్యామ్ (RAM) మరియు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్.
- వైఫై కనెక్షన్ (కనీసం 20mbps స్పీడ్ ఉండాలి) మరియు పవర్ బ్యాకప్ (యూపీఎస్) తప్పనిసరి.
- కాల్స్ మాట్లాడటానికి ఒక యూఎస్‌బీ (USB) హెడ్‌సెట్ ఉండాలి.
జీతం ఎలా ఉంటుంది?
ఫ్రెషర్స్ అయితే నెలకు చేతికి ₹12,500 వేలు వస్తుంది, 1 సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లకు నెలకు చేతికి ₹14,000 ఇస్తారు. అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలో వర్సెంట్ టెస్ట్‌లో స్కోర్ 3 లేదా అంతకంటే ఎక్కువ సాధించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది?
సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 5 రౌండ్లలో ఉంటుంది. కమ్యూనికేషన్ మరియు టైపింగ్ స్పీడ్ బాగుంటే ఈజీగానే సెలెక్ట్ అవ్వచ్చు.
- హెచ్ఆర్ స్క్రీనింగ్
- వర్సెంట్ రౌండ్
- ఆపరేషన్స్ రౌండ్
- టైపింగ్ టెస్ట్
- క్లయింట్ రౌండ్
అప్లై చేయడం ఎలా?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమేను టెక్ మహీంద్రా హెచ్ఆర్ Nabanita Chakraborty కి ts00686545@techmahindra.com ఈమెయిల్ ఐడీకి పంపించవచ్చు. లేదా నేరుగా 6291055422 మొబైల్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. కాల్ చేసేటప్పుడు ఆఫీస్ అవర్స్‌లోనే చేయడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడగలిగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిక్రూట్మెంట్ షేర్ చేయండి.










