#APInterExams #AP10thExams #TSInterExams #TS10thExams #CompetitiveExams #GovtJobs #PrivateJobs #WFH

---Advertisement---

రైల్వే అభ్యర్తులు జాగ్రత! ఈ పరపాట్లు చేస్తే రాత పరీక్షలో పాస్ అవ్వడం కష్టమే…

ఎంతో మందికి రైల్వేలో ఉద్యోగం చేయాలి అని కళలు కంటూ ఉంటారు, అలాంటి వల్ల కొసం రైల్వే బోర్డు ఒక తియ్యటి కబురు చెప్పింది అని చెపుకోవచ్చు ఎందుకు అంటే 100 లేదా 200 ఖాళీలు కాకుండా ఏకంగా 11 వేలు ఖాళీలను భర్తీ చేయడానికి దరకస్తూ ప్రక్రియ ప్రారంభం అయింది, 18 ఏళ్లు నిండి 10వ తరగతితో పాటు ITI, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది ఒక జాక్పాట్, స్టార్టింగ్ సేలరీ నే మనకు దగ్గర దగ్గర 20 వేలు నుండి ప్రారంభం అవుతుంది, మిగితా అన్ని వివరాలు ఆలాగే తీసుకోవాల్సిన జాగ్రతలు అన్ని మీరు కింద చదివి తెలుసుకోవచ్చు.

---Advertisement---

HIGHLIGHTS

  • 11,127 ఖాళీలు తో రైల్వే బంపర్ నోటిఫికేషన్
  • 15 మే నుండి 16 జూన్ వరుకు దరకస్తూ టైమ్
  • 18 ఏళ్లు నిండిన వాళ్ళు అర్హులు

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఎదురుచూపులు ముగిశాయి. 11,127 ఖాళీల భర్తీకి సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అధికారికంగా అప్లికేషన్ లింక్‌ను ఓపెన్ చేసింది. అయితే, నోటిఫికేషన్ చూడగానే అప్లై చేసేయడం కంటే, అసలు సెలక్షన్ ఎలా ఉంటుంది? పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది నోటిఫికేషన్ రాగానే కేవలం సిలబస్ చూసి చదవడం మొదలుపెడతారు. కానీ నిజం చెప్పాలంటే.. ఈ ప్రయాణంలో మొదటి అడుగు అప్లికేషన్ దగ్గరే ఉంటుంది. ఒక్క చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
పోస్ట్ పేరు లోకో పైలెట్
ఖాళీలు 11,127
అప్లికేషన్ విధనం ఆన్లైన్
దరకస్తూ ప్రారంభం తేదీ 15 మే 2026
చివరి తేదీ 16 జూన్ 2026
వయసు అర్హత 18 ఏళ్లు నుండి 30 ఏళ్లు
జీతం రూ.19,900/-
అధికారిక వెబ్సైట్

పరీక్షలు ఎప్పుడు ఉండవచ్చు?

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, RRB ALP రాత పరీక్షలు (CBT) సెప్టెంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది. అంటే మీ దగ్గర సరిగ్గా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ గ్యాప్‌లో మీరు సిలబస్‌తో పాటు ప్రాక్టీస్ టెస్టుల మీద కూడా దృష్టి పెట్టాలి.

అర్హతలు

పదో తరగతితో పాటు ఐటీఐ (ITI), డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారు దీనికి అర్హులు. అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికెట్ల వివరాలు, ఫోటో, సంతకం అన్నీ రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీ దగ్గర ఉండేవి మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీ (OTP) ద్వారానే అవి యాక్టివేట్ అవుతాయి.

ఫీజు రీఫండ్.. ఒక చిన్న ఊరట!

రైల్వే పరీక్షల్లో మనవాళ్లకు ఒక మంచి విషయం ఏంటంటే ఫీజు వాపస్ రావడం. జనరల్, ఓబీసీ అభ్యర్థులు ₹500 కడితే, CBT-1 పరీక్ష రాసిన తర్వాత ₹400 వెనక్కి వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు ఎక్స్‌-సర్వీస్‌మెన్ ₹250 కడితే, అది పూర్తిగా రీఫండ్ అవుతుంది.
కానీ గుర్తుంచుకోండి.. మీరు పరీక్షకు హాజరైతేనే ఈ రీఫండ్ వస్తుంది, లేకపోతే ఆ పైసా కూడా రాదు.

సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది

ఈ ఉద్యోగం కోసం చాలా స్టేజీలలో ఎంపిక ఉంటుంది. మొదట CBT-1 పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. ఇందులో క్వాలిఫై అయినవారినే CBT-2 కి ఎంపిక చేస్తారు. అసలు మెరిట్‌లో కీలకమైనది మాత్రం CBT-2 మార్కులే. అందుకే చాలామంది అభ్యర్థులు ఈ పరీక్ష పైనే ఎక్కువ ఫోకస్ పెడతారు.

దాని తర్వాత CBAT లేదా సైకో టెస్ట్ ఉంటుంది. లోకో పైలట్ పోస్టులకు రియాక్షన్ టైమ్, కాన్సంట్రేషన్ వంటి స్కిల్స్ కూడా ముఖ్యంగా చూస్తారు. అందుకే ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపు విషయంలో రైల్వే నిబంధనలు కఠినంగా ఉంటాయి. చిన్న సమస్య ఉన్నా కొన్ని పోస్టులకు అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే మెడికల్ హెల్త్ గురించి ఒకసారి చెక్ చేసుకోండి.

అప్లై చేసేటప్పుడు వచ్చే వచ్చే ఇబ్బందులు

మే 15 నుండే ఆన్‌లైన్ ప్రాసెస్ మొదలైంది. ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతుంది. మనవాళ్లు చాలామంది చివరి రోజు వరకు వెయిట్ చేస్తారు. జూన్ 14న లాస్ట్ డేట్ అనుకుంటే, ఆ రోజు సర్వర్లు ఖచ్చితంగా డౌన్ అవుతాయి. అందుకే వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం మంచిది.

ముఖ్యమైన తేదీలు ఇవే

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15 మే 2026

అప్లై చేయడానికి చివరి తేదీ: 14 జూన్ 2026

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 16 జూన్ 2026

తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం (Correction Window): జూన్ 17 నుండి జూన్ 26 వరకు

ఈ విషయాల్లో జాగ్రత్త…

రైల్వే ఉద్యోగం అనేది కేవలం జీతం కోసం మాత్రమే కాదు, అదొక సెక్యూరిటీ. కానీ 11 వేల పోస్టులకు లక్షలాది మంది పోటీ పడతారు. అందుకే కేవలం అప్లై చేయడమే కాకుండా, సెప్టెంబర్ ఎగ్జామ్ నాటికి పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉండండి. ఆఅలాగే మీ మీ డాక్యుమెంట్స్ లో మీ పేరు గాని లేదా డేట్ ఆఫ్ బర్త్ గాని వేరే డీటైల్స్ ఏవైనా రాంగ్ ఉంటే కరెక్ట్ చేసుకోండి ఎందుకు అంటే ఒకవేళ ఏవైనా రాంగ్ ఉంటే గనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు సొ అందుకే మీరు ఇప్పటి నుంచే జాగ్రత చేసుకోవాలి, అలా కాకుండా మీరు గాలి కి వదిలేస్తే గనుక మీ ఉద్యోగం కూడా గాలికి వెళ్తుంది, డౌట్ ఉంటే అఫీషియల్ వెబ్‌సైట్ rrbapply.gov.in లో ఒకసారి క్లియర్ కట్‌గా చూసుకోండి.