#APInterExams #AP10thExams #TSInterExams #TS10thExams #CompetitiveExams #GovtJobs #PrivateJobs #WFH

---Advertisement---

సీఆర్‌పీఎఫ్ లో 9,175 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి కొన్ని గంటలు మాత్రమే టైమ్!

---Advertisement---

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) విభాగంలో మొత్తం 9,175 ఖాళీల భర్తీకి జరుగుతున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు చివరి దశకు వచ్చింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈరోజే మే 19, 2026 చివరి తేదీ.డ్రైవర్, కుక్, కార్పెంటర్, బ్రాస్ బ్యాండ్, మోటార్ మెకానిక్, మేసన్ వంటి రకరకాల విభాగాల్లో పురుషులు మరియు మహిళా అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ రోజే లాస్ట్ డేట్…

ఏప్రిల్ 20 నుండి ప్రారంభమైన ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజుతో ముగుస్తుంది. చాలామంది అభ్యర్థులు చివరి నిమిషం వరకు వెయిట్ చేయడం వల్ల ఈరోజు వెబ్‌సైట్‌పై భారీగా లోడ్ పడి సర్వర్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్లు ఉంటే వెంటనే అఫీషియల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసుకోండి ఫీజు చెల్లించడానికి కూడా ఈరోజే ఆఖరి అవకాశం, అప్లై చేయడానికి లింకు కింద ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు ఒకసారి చూస్తే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 20, 2026
  • అప్లై చేయడానికి చివరి తేదీ: మే 19, 2026
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 19, 2026
  • ఎగ్జామ్ మరియు అడ్మిట్ కార్డ్ తేదీలు: త్వరలోనే అనౌన్స్ చేస్తారు

దరఖాస్తు ఫీజు వివరాలు

  • జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ : ₹100
  • ఎస్సీ, ఎస్టీ: ఎలాంటి ఫీజు లేదు
  • మహిళలు (అన్ని కేటగిరీలు): ఫీజు నుండి మినహాయింపు ఉంది
  • ఎక్స్‌-సర్వీస్‌మెన్: ఎలాంటి ఫీజు లేదు

ఫీజును యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

అప్లై చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

  1. మొదట సీఆర్‌పీఎఫ్ అఫీషియల్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను విసిట్ చేయండి, లింకు కింద ఇవ్వడం జరిగింది.
  2. అక్కడ ఉన్న “CRPF Constable Tradesman Recruitment 2026” లింక్ మీద క్లిక్ చేయాలి.
  3. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  4. అప్లికేషన్ ఫామ్‌లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా నింపండి.
  5. నోటిఫికేషన్‌లో అడిగిన ఫార్మాట్ ప్రకారం మీ ఫోటో, సంతకం, మరియు ఇతర సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
  6. మీ కేటగిరీని బట్టి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించండి.
  7. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఒక ప్రింటౌట్ తీసి దగ్గర పెట్టుకోండి.

చివరి గంటల్లో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అర్హత గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. దరఖాస్తు చేసేటప్పుడు మీ వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మర్చిపోకండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి