ఎయిర్‌పోర్ట్‌లలో జాబ్ చేయాలనేది విమలా మధ్య తమ జీవతాన్ని గడపాలి అని చాలామంది కళలు కంటూ ఉంటారు. ఇక కళలు కాలాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఎయిర్‌పోర్టు అథారిటీ నుండి ఒక చక్కటి నోటిఫికేషన్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కి చెందిన ఒక సంస్థ… సెక్యూరిటీ స్క్రీనర్ మరియు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ చేస్తాఉంది. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలే అయినా, జీతాలు మాత్రం చాలా బాగున్నాయి.
| సంస్థ | AAI కార్గో లాజిస్టిక్స్ |
| పోస్టు | సెక్యూరిటీ స్క్రీనర్ & అసిస్టెంట్ సెక్యూరిటీ |
| ఖాళీలు | 158 |
| జీతం | 30,000 వేలు నుండి 34,000 వేలు |
| విద్య అర్హత | డిగ్రీ లేదా ఇంటర్ |
| అప్లికేషన్ స్టార్ట్ తేదీ | 18 మే 2026 |
| అప్లికేషన్ చివరి తేదీ | 8 జూన్ 2026 |
| అఫిసియల్ వెబ్సైట్ | aaiclas.aero |
ఏయే పోస్టులు ఉన్నాయి?
మొత్తం 210 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకు సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు (158 ఖాళీలు) ఉన్నాయి. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ల కోసం అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు (62 ఖాళీలు) కేటాయించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసిస్టెంట్ పోస్టులకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో కూడా 9 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్లకు సొంత ప్రాంతంలోనే పని చేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే ఎయిర్పోర్ట్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా కొంత అవసరం. హిందీ లేదా లోకల్ లాంగ్వేజ్ మాట్లాడటం, చదవడం వస్తే ప్లస్.

జీతం ఎంత ఇస్తారు?
ఈ ఉద్యోగాల్లో చేరిన వాళ్లకు ప్రతి ఏటా జీతం పెరుగుతుంది. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుకు మొదటి ఏడాది నెలకు ₹30,000 ఇస్తారు, ఇది మూడో ఏడాదికి ₹34,000 వరకు పెరుగుతుంది. అదే అసిస్టెంట్ పోస్టుకైతే స్టార్టింగ్‌లో ₹21,500 ఇస్తూ.. మూడో సంవత్సరానికి ₹22,500 వరకు పెంచుకుంటూ వెళ్తారు.
డట్స్ ఇవే.. నోట్ చేసుకోండి
రెండు పోస్టులకూ వేర్వేరు తేదీల్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు ఆన్లైన్ లింక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. దీనికి జూన్ 8 లోపు అప్లై చేసుకోవాలి. ఇక ఇంటర్ అర్హత ఉన్న అసిస్టెంట్ పోస్టుల లింక్ జూన్ 11న ఓపెన్ అవుతుంది. దానికి జూలై 2 వరకు టైమ్ ఇచ్చారు.
సెలక్షన్ ఎలా ఉంటుంది?
దీనికి ఎలాంటి కఠినమైన రాత పరీక్షలు లేవు. మొదట మీరు అప్లై చేసినప్పుడు మీ డిగ్రీ లేదా ఇంటర్లో వచ్చిన మార్కులను బట్టి ఒక లిస్ట్ తీస్తారు. అందులో సెలక్ట్ అయిన వాళ్లను ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్‌కు పిలుస్తారు. ఆ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
వయస్సు విషయానికొస్తే 27 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు స్క్రీనర్ పోస్టుకు ₹750, అసిస్టెంట్ పోస్టుకు ₹500 అప్లికేషన్ ఫీజు కట్టాలి. కానీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు మహిళలకు ఏ పోస్టుకైనా ఫీజు కేవలం ₹100 మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చూసుకుని అప్లికేషన్ పెట్టుకోవచ్చు.










