ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారికి ఫైనల్‌గా ఒక క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,523 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉన్నత విద్యాశాఖలో ఇది ఒక భారీ రిక్రూట్‌మెంట్ అని చెప్పాలి.
| Notification | Recruitment for AP Universities |
| Universities | Andhra University, RGUKT, Sri Venkateswara University etc |
| Vacancies | 1523 |
| Post Name | Professors, Associate Professors, Librarians etc |
| Application Mode | Online |
| Application Starting Date | 18th May |
| Last Date to Apply | 8th June |
| Age Limit | 44 Years |
| Official Website | apuniversitiesrecruitment.apcfss.in |
యూనివర్సిటీల వారీగా ఖాళీలు
మొత్తం 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ ఖాళీలు ఉండగా, మిగిలిన 279 పోస్టులు బ్యాక్‌లాగ్‌కు సంబంధించినవి. ముఖ్యంగా ఆర్జీయూకేటీ (RGUKT) లో అత్యధికంగా 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో 246, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 125, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 103 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం, విజయనగరం లాంటి చాలా యూనివర్సిటీల్లో ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి.

ఎంపిక విధానం..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ మంది పోటీ పడితే ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థులు తక్కువగా ఉంటే డైరెక్ట్‌గా స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు మాత్రం ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అకడమిక్ రికార్డ్, రీసెర్చ్ స్కోర్ ఆధారంగానే ఇంటర్వ్యూకి పిలుస్తారు.అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ యూనివర్సిటీలకు అప్లై చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఇంటర్వ్యూకు సెలక్ట్ అయితే, మీ ప్రిఫరెన్స్ ఏంటనేది పోర్టల్‌లో ఐదు రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 18
- దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 8
- హార్డ్ కాపీలు పంపడానికి లాస్ట్ డేట్: జూన్ 15
- ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల: జూన్ 22
అర్హతలు మరియు జీతం
అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులతో పాటు నెట్ (NET/SET) లేదా పీహెచ్‌డీ ఉండాలి. జీతం విషయానికొస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల బేసిక్ పే ₹57,700 నుండి మొదలవుతుంది. ప్రొఫెసర్ స్థాయి వారికి అది ₹1.44 లక్షల నుండి ₹2.18 లక్షల వరకు ఉంటుంది.
నిజానికి ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు సర్వర్ సమస్యలు రావడం సహజం. చాలామంది చివరి రోజే అప్లై చేద్దామని చూస్తుంటారు, అప్పుడే టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పేమెంట్ సక్సెస్ అయినా అప్లికేషన్ అప్డేట్ కావడానికి కొంత టైమ్ పడుతుంది. ఇంటర్వ్యూ కొసం తమ సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు ప్రెజెంటేషన్ మీద కూడా దృష్టి పెట్టడం మంచిది. దరఖాస్తు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అన్ని సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా డాక్యుమెంట్ వెరీఫికేషన్ లో ప్రాబ్లం రవచ్చు.










