అసలు మేటర్ ఏంటంటే.. ఈ మధ్య అందరి ఫోన్లలోనూ ఏదో ఒక ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మెసేజ్ కనిపిస్తూనే ఉంది. “రోజుకు గంట కేటాయిస్తే చాలు, వేలల్లో సంపాదించవచ్చు” అని వచ్చే లింకులను చూసి మనవాళ్లు చాలామంది ఆశపడి మోసపోతున్నారు. అందుకే, గాల్లో మేడలు కట్టకుండా.. గ్రౌండ్ లెవల్‌లో స్టూడెంట్స్‌కు, నిరుద్యోగులకు వర్కౌట్ అయ్యే జెన్యూన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను కూడా నా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేద్దామని ఒక ‘డేటా ఎంట్రీ’ కంపెనీకి ₹2,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాను. తీరా చూస్తే వారం తర్వాత వాళ్ళ అడ్రస్ లేదు, వెబ్‌సైట్ లేదు. ఆ తర్వాతే అర్థమైంది.. మనం డబ్బులు కట్టేవి కాదు, మన పనికి వాళ్లు డబ్బులు ఇచ్చేవే నిజమైన జాబ్స్ అని.
మరి ఏ జాబ్స్ చేస్తే డబ్బులు వస్తాయి?
కంటెంట్ రైటింగ్

మొదటిది కంటెంట్ రైటింగ్. దీనికి పెద్ద పెద్ద ఆఫీసులు అక్కర్లేదు. నా ఫ్రెండ్ ఒకడు వైజాగ్ లో ఉంటూనే ఒక ట్రావెల్ వెబ్‌సైట్ కోసం తెలుగులో ఆర్టికల్స్ రాస్తుంటాడు. వాడు ఊరికే కూర్చున్నప్పుడు తనకి తెలిసిన టూర్ ప్లేసెస్ గురించి రాసి పంపిస్తాడు. ఒక్కో ఆర్టికల్‌కు వాడికి కనీసం ₹500 వస్తాయి. మీకు రాయడం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్.
గ్రాఫిక్ డిజైనింగ్
ఇక రెండోది కాన్వా (Canva) డిజైనింగ్. ఇప్పటికీ చాలామంది లోకల్ బిజినెస్ ఓనర్లకు వాళ్ళ షాప్ ఆఫర్ల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం రాదు. మీరు ఒక రెండు గంటలు కూర్చుని కాన్వా నేర్చుకుంటే, వాళ్ళకి కావాల్సిన పోస్టర్లు చేసి ఇచ్చి నెలకి ఒక ₹3,000 – ₹5,000 సంపాదించొచ్చు. నమ్మండి.. ఇది చాలా ఈజీ, మనకి ఫోటో ఎడిటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉంటే చాలు. ఈ canva ఎడిటింగ్ ఎలా చేయాలో మీరు యూట్యూబ్ ద్వారా ఫ్రీ గా నేర్చుకోవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ లేదా అఫిలియేట్

మీకు వాట్సాప్ గ్రూపులు ఎక్కువ ఉన్నాయా? అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిలో అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు. ఎవరైనా మీ లింక్ ద్వారా కొంటే మీకు కమిషన్ వస్తుంది. కానీ ఇది అందరికీ వర్కవుట్ అవ్వదు, కొంచెం ఓపిక ఉండాలి. లేదా మీరే మీ యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సప్ చానెల్ స్టార్ట్ చేసి అందులో ఆడియన్స్ ను గ్రో చేసి అఫిలియేట్ లింక్స్ ద్వారా భారీ మొత్తం లో డబ్బులు సంపడించచ్చు కొందరు అయితే ఈ మార్గం ద్వారా కోట్లల్లో సంపడిస్తున్నారు.
యూట్యూబ్ వీడియో ఎడిటర్
ఇప్పుడంతా యూట్యూబ్ క్రియేటర్లు చాలా పెరిగిపోయారు అందరు వీడియోస్ మరియు రీల్స్ చేస్తున్నారు కొత్త యూట్యూబర్లు వీడియోలు బాగానే తీస్తారు కానీ ఎడిటింగ్ దగ్గర ఇబ్బంది పడతారు. మీకు మొబైల్‌లోనే VN లేదా CapCut లాంటి యాప్స్ వాడటం వస్తే రాకపోయినా మీరు ఆన్లైన్ లో చాలా ఫ్రీ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఎడిట్ చేసి పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. నా జూనియర్ ఒకడు ఇలాగే వీడియొ & షార్ట్స్ ఎడిట్ చేస్తూ తన కాలేజీ ఫీజులు కట్టుకుంటున్నాడు.
జాగ్రత్త!
పని దొరకడం ఒక ఎత్తు అయితే, ఆ పనిని ఫినిష్ చేసి చేతికి డబ్బులు వచ్చే వరకు ఉండే టెన్షన్ ఇంకో ఎత్తు. మీరు ఏదైనా అర్జెంట్ డెడ్-లైన్ ఉన్న పని చేస్తున్నప్పుడు సడన్‌గా file డిలీట్ అయితే లేదా సేవ్ అవ్వకపోతే ఆ షాక్ మామూలుగా ఉండదు. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ లేకపోయినా, ఫోన్ హాట్‌స్పాట్ స్లో అయినా ప్రాజెక్ట్ చేజారిపోయే ప్రమాదం ఉంది. మరో పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఈ మధ్య చాలా కంపెనీలు పేమెంట్స్ కోసం NPCI లింక్ అయి ఉన్న అకౌంట్స్ మాత్రమే అడుగుతున్నాయి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ లేకపోతే, డబ్బులు పడినా అవి హోల్డ్‌లో ఉండిపోతాయి. ఒక్కోసారి పేమెంట్ సక్సెస్ అని స్క్రీన్ షాట్ వస్తుంది కానీ మన అకౌంట్‌లోకి మాత్రం రూపాయి చేరదు. వీటితో పాటు ఫేక్ కంపెనీలు మన దగ్గర పని చేయించుకుని, తీరా డబ్బులు అడిగేసరికి బ్లాక్ చేసేస్తుంటాయి. అందుకే పని మొదలుపెట్టే ముందే ఆ క్లయింట్ జెన్యూన్ కాదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవడం మరచిపోకండి.
చివరిగా నా మాట
డబ్బు సంపాదించాలనే తపన ఉండాలి కానీ, అది తొందరపాటుగా మారకూడదు. అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి, పేమెంట్ లేట్ అవుతుంది, ఒక్కోసారి మనం చేసిన పని బాలేదని క్లయింట్ తిడతాడు కూడా. అయినా సరే వదలకుండా చేస్తేనే సక్సెస్ అవుతాం. ఖాళీ టైంలో ఫోన్లో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసే బదులు, ఇలాంటివి ట్రై చేస్తే మన పాకెట్ మనీ మనమే సంపాదించుకోవచ్చు.









