#APInterExams #AP10thExams #TSInterExams #TS10thExams #CompetitiveExams #GovtJobs #PrivateJobs #WFH

---Advertisement---

చదువు ఆపాల్సిన అవసరం లేదు.. అమ్మాయిలు కొసం ప్రత్యక స్కాలర్షిప్

అమ్మాయిల చదువుకు సహాయం చేయడానికి ArcelorMittal Nippon Steel India ప్రత్యేక స్కాలర్‌షిప్ అందిస్తోంది. స్కూల్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, మెడికల్ సహా పలు కోర్సులు చదువుతున్న విద్యార్థినులు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారికి కోర్సును బట్టి రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు.

---Advertisement---

HIGHLIGHTS

  • కేవలం అమ్మాయిల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్
  • ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాల విద్యార్థినులకు అవకాశం
  • కోర్సును బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు బంపర్ న్యూస్ ఏ అని చెప్పుకోవాలి ఎందుకు అంటే చదువుకు అండగా నిలిచేందుకు ప్రముఖ స్టీల్ కంపెనీ ArcelorMittal Nippon Steel India “Beti Padhao Scholarship” పేరుతో ఏ తరగతి చదువుతున్నారో తేడా లేకుండా స్కాలర్‌షిప్ అందిస్తోంది. చదువు కొనసాగించాలనే ఆసక్తి ఉన్నా కూడా కొంత మంది ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఒక వరమే.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించి, వారు తమ విద్యను ఆపకుండా ముందుకు సాగేందుకు ప్రోత్సహించనున్నారు. బాలికల విద్యాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, భవిష్యత్తులో ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు అందుకోవడానికి ఈ స్కాలర్‌షిప్ సహాయపడుతుంది.

ఎవరు అర్హులు?

ఎవరు ఎవరు అప్లై చేసుకోవచ్చు అని డౌట్ గా ఉందా? అయితే ఈ కింద చదవండి

దరకస్తూ చేసే విద్యార్థినులు భారతీయులు అయి ఉండాలి. ఇది కేవలం అమ్మాయిల కోసం మాత్రమే అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు. గత తరగతిలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. అలాగే విద్యార్థిని పేరుతో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.

ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. స్కూల్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, మెడికల్ కోర్సులు, బీఈ, బీటెక్ మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఇలా మీరు ఎలాంటి కోర్సు అయిన చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొనే విద్యార్థినులకు కూడా ఈ అవకాశం ఉంటుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్..

అప్లై చేసే విద్యార్థినులు కొన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధర్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, గత సంవత్సరం మార్కుల మెమో తప్పనిసరిగా ఇవ్వాలి. కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం లేదా ఐటీఆర్/సాలరీ సర్టిఫికెట్ కూడా సమర్పించాలి.విద్యార్థిని లేదా తల్లిదండ్రుల బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, ఈ ఏడాది ఫీజు రసీదు లేదా ఫీజు వివరాలు, అలాగే చదువుతున్న స్కూల్ లేదా కాలేజీ నుంచి బోనాఫైడ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి మహిళా క్రీడకారులు అయితే స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా జతచేయాలి.

అన్ని డాక్యుమెంట్లు క్లియర్‌గా కనిపించేలా ఉండాలి. వాటిని .jpeg లేదా .png ఫార్మాట్‌లో మాత్రమే అప్లోడ్ చేయాలి.

ప్రతి ఒక స్టూడెంట్ తమ తమ డాక్యుమెంట్ యొక్క డీటైల్స్ మరియు బ్యాంక్ ఖాతా డీటైల్స్ ను సరిగ్గా ఉంచుకోవాలి ఎందుకు అంటే డీటైల్స్ రాంగ్ ఉంటే గనుక మనకు స్కాలర్షిప్ పొందడం లో ప్రాబ్లమ్స్ ఎదురుకోవాల్సి వస్తుంది.

ఎవరు ఎవరికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది….

చదువుతున్న కోర్సు ఆధారంగా విద్యార్థినులకు వేర్వేరు మొత్తాలు అందిస్తారు. ప్రైమరీ, సెకండరీ మరియు 10వ తరగతి విద్యార్థినులకు రూ.12 వేల వరకు స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇంటర్ చదువుతున్న వారికి రూ.15 వేల సహాయం అందుతుంది.బీఈ, బీటెక్ మరియు మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులకు రూ.50 వేల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. డిగ్రీ కోర్సులు చేస్తున్న వారికి రూ.40 వేల వరకు ఇస్తారు.

ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారికి రూ.30 వేలు, డిప్లొమా విద్యార్థినులకు రూ.20 వేలు, ఐటీఐ కోర్సులకు రూ.10 వేలు సహాయం అందించనున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనే విద్యార్థినులకు రూ.15 వేలు వరకు స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు.

మనం ఈ ఆర్టికల్ లో అమ్మాయిలు కొసం వాళ్ళకు అండగా ఉండేలా ప్రముక కొంపెనీ నుండి స్కాలర్షిప్ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము, మీలో ఎవరు ఎవరు ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఉన్నారో వాళ్ళు తప్పక అప్లై చేసుకోండి, అప్పలి లింకు కింద ఇవ్వడం జరిగింది, మీరు ఒకవేళ అర్హులు కాకపోయినా మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబం లో ఎవరికైనా ఈ అర్హతలు ఉంటే గనుక వాళ్ళకు షేర్ చేయడం మాత్రం మరచిపోకండి.

స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

MORE