ఏపీలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇంపార్టెంట్ అప్‌డేట్ వచ్చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (DGE AP) మే 18న అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (మే 2026) హాల్ టికెట్లను విడుదల చేసింది. మార్చి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఈ హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది.
టైమ్ టేబుల్ ప్రకారం ఏపీ టెన్త్ క్లాస్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుండి జూన్ 4, 2026 వరకు జరగనున్నాయి. మీ దగ్గర కేవలం వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది కాబట్టి వెంటనే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోండి.
హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్
- మొదట అఫీషియల్ వెబ్‌సైట్ bse.ap.gov.in ఓపెన్ చేయండి.
- అక్కడ సప్లిమెంటరీ హాల్ టికెట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
- మీ జిల్లా (District) మరియు స్కూల్ పేరు సెలక్ట్ చేసుకోండి.
- స్కూల్ పేరు ఎంచుకోగానే ఆ స్కూల్ విద్యార్థుల పేర్లన్నీ కనిపిస్తాయి. అందులో మీ పేరు సెలక్ట్ చేసుకోవాలి.
- మీ పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేసి ‘Download Hall Ticket’ కొడితే స్క్రీన్ మీద హాల్ టికెట్ వచ్చేస్తుంది. ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.
వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్.. చాలా ఈజీ!
ఈసారి విద్యార్థుల కోసం ప్రభుత్వం సరికొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ (Mana Mitra) ద్వారా కూడా హాల్ టికెట్ పొందే సదుపాయం తెచ్చింది. వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే ఈ పద్ధతి ఫాలో అవ్వండి.
- మీ మొబైల్ నుండి 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పెట్టండి.
- అక్కడ వచ్చే ఆప్షన్లలో “Choose Service” క్లిక్ చేసి.. “Education Services” సెలెక్ట్ చేసుకోండి.
- ఆ తర్వాత “ASE 2026 Hall Ticket” ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీ టెన్త్ క్లాస్ మార్చి 2026 రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) ఎంటర్ చేయండి.
- వివరాలు సరిచూసుకుని “Confirm” కొడితే మీ హాల్ టికెట్ నేరుగా వాట్సాప్ లోనే పీడీఎఫ్ రూపంలో వచ్చేస్తుంది.
చివరి నిమిషంలో సర్వర్లు బిజీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇప్పుడే మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఏవైనా లేటెస్ట్ అప్‌డేట్స్ కొసం అఫీషియల్ వెబ్‌సైట్ లోనే చెక్ చేసుకోండి.








