సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే బిటెక్ స్టూడెంట్స్‌కు ఒక మంచి అవకాశం వచ్చింది అనే చెప్పచ్చు. యంగ్‌మైండ్స్ టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ డేటా అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ కోసం ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ విడుదల చేసింది. మొత్తం 197 ఖాళీలు ఉన్నాయి. ఇది వర్చువల్ ఇంటర్న్‌షిప్, అంటే ఇంట్లో కూర్చునే పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న మాట.
ఎంపికైన వాళ్లు డేటా అనాలసిస్, విజువలైజేషన్ మరియు డేటాతో పనిచేసే రకరకాల టూల్స్ మీద ప్రాక్టికల్‌గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. కంపెనీలో ఉండే సీనియర్లు మీకు మెంటార్స్‌గా ఉండి గైడ్ చేస్తారు. కాలేజీ చదువు అయిపోయాక జాబ్స్ కోసం ట్రై చేసేటప్పుడు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎంతగానో ప్లస్ అవుతుంది.
ఎవరు అర్హులు?
బి.టెక్ (B.Tech) లేదా బి.ఈ (B.E) చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా దీనికి అప్లై చేయవచ్చు. ఏ బ్రాంచ్ వారైనా పర్లేదు. డేటా అనలిటిక్స్ మీద ఆసక్తి ఉండి, బేసిక్ స్కిల్స్ తెలిసుంటే చాలు.
ముఖ్యమైన వివరాలు ఇవే
- వర్చువల్ (ఇంటి నుండే చేయాలి)
- 6 నెలల ఇంటర్న్షిప్
- నెలకు రూ 5,000 వేలు స్టైపెండ్
- అప్లై చేయడానికి అక్టోబర్ 28, 2026 వరకు టైమ్ ఉంది.
సర్టిఫికెట్లు మరియు బెనిఫిట్స్
ఈ 6 నెలల ఇంటర్న్‌షిప్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే కంపెనీ నుండి అఫీషియల్ సర్టిఫికేట్ ఇస్తారు. పని బాగా చేసే వాళ్లకు లెటర్ ఆఫ్ రికమండేషన్ (LoR)తో పాటు కొన్ని అవార్డులు కూడా ఇస్తారు.
ఇంట్లో నుండి చేసే పనే అయినా రెగ్యులర్ అటెండెన్స్ అనేది ముఖ్యం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్స్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ రూల్స్ ప్రకారం నెలకు 1 లేదా 2 లీవ్స్ తీసుకోవచ్చు.
ఇక మీ పర్ఫార్మెన్స్‌ను కంపెనీ కేవలం టాస్క్‌లు పూర్తి చేయడాన్ని బట్టే కాకుండా.. మీరు రాసే కోడ్ క్వాలిటీ, కొత్త విషయాలు నేర్చుకునే తపన మరియు టీమ్‌తో మీరు పని చేసే విధానం కూడా ముఖ్యం. చాలామంది మొదట్లో కమ్యూనికేషన్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతుంటారు, కానీ ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ ద్వారా ఆ స్కిల్స్ కూడా మెరుగవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కింద ఇచ్చిన కంపెనీ అఫీషియల్ పోర్టల్ లింకు ద్వారా డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు.







